
ఖమ్మం, 10 జూన్ (హి.స.)
ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యాయత్నం ఘటనపై పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆ కఠినాత్ముడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..