ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో తెలంగాణ పోలీస్ శాఖ ముందంజ.. డీజీపీ సి.వి. ఆనంద్
ఆదిలాబాద్, 10 జూన్ (హి.స.) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా 300 వందల నూతన సీసీటీవీ కెమెరాలను బుధవార
DGP


ఆదిలాబాద్, 10 జూన్ (హి.స.)

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా 300 వందల నూతన సీసీటీవీ కెమెరాలను బుధవారం డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రత, నేర నియంత్రణలో సాంకేతికత కీలకంగా మారుతుందన్నారు. అనంతరం మొక్కలు నాటి పచ్చదనం ప్రాముఖ్యతను వివరించారు.

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ కెమెరాలలో 220 సీసీటీవీ కెమెరాలు గ్రామీణ ప్రాంతాలలో, 80 సీసీటీవీ కెమెరాలు పట్టణ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ, సీఐడీ, ఏసీబీ డీజీ చారు సిన్హా, మల్టీజోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ (అడ్మిన్) పి. మౌనిక ఐపీఎస్, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, పట్టణ సీఐ బి. సునీల్ కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande