
నల్గొండ, 10 జూన్ (హి.స.)
భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చునని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ అన్నారు. బుధవారం నల్గొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో రోడ్డు భద్రత అవగాహన గ్రామ సభనిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. యువతకు హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సామూహికంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్రాఫిక్ సిగ్నల్ పాటించడం వేగ పరిమితులకు లోబడి డ్రైవింగ్ చేయడం హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం, మధ్యం సేవించి వాహనం నడపరాదన్నారు. రహదారుల భద్రత అనేది ఒకరి బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు బాధ్యత మాత్రం అన్నారు. కుటుంబ సభ్యులు తమకోసం వేయికళ్లతో ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
అధిక వేగంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాన నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని ఉంచారు. ఇంటికి కిటికీలకు ఎలా గ్రీక్స్ పెడుతున్నారో అదేవిధంగా తమ భద్రత కోసం హెల్మెట్ వాడాలని సూచించారు. దేశంలో సంవత్సరానికి 7, లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో 7000 మంది, ప్రమాదాలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి తాళం ఫోన్ పౌచ్, తలకు హెల్మెట్ కంపల్సరిగా పెట్టుకునే విధంగా చూడాలని అన్నారు. మందు తాగి వాహనదారుడు వాహనం నడపకూడదని, డ్రైవ్ లో అధిక మొత్తంలో కేసు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..