
రాజమహేంద్రవరం, 11 జూన్ (హి.స.)
: రాష్ట్రంలోని తొలి ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రం నిర్మాణానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. జార్విన్ ఫ్లైట్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి చెందిన ప్రాంతంలో ఈ అకాడమీ నిర్మాణం చేపట్టనున్నారు. దేశంలో శిక్షణ పొందిన పైలట్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని రూ.100 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలోనే ఎఫ్టీవో నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, విమానయాన రంగ నిపుణులతో కలిసి ఎంపీ శంకుస్థాపన చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ