
మచిలీపట్నం, 11 జూన్ (హి.స.)
పెనమలూరు ఠాణా పరిధిలోని యనమలకుదురు, కానూరు, పోరంకి, సనత్నగర్ తదితర పాంత్రాల్లో నిత్యం గంజాయి బ్యాచ్లు అలజడి సృష్టిస్తున్నాయి. అర్ధరాత్రులు గుంపులుగా తిరుగుతూ పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. తరచూ గ్యాంగ్వార్లతో పెనమలూరు పరిసరాల్లో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. రోడ్లపై ఒంటరిగా తిరగాలంటే హడలిపోతున్నారు. విజయవాడ నగరంలో గంజాయి బ్యాచ్లపై నగర పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. నగర బహిష్కరణ చేసిన వారంతా ప్రశాంతంగా ఉండే పెనమలూరు ఠాణా పరిధిలోని సనత్నగర్, యనమలకుదురు, కానూరు, పోరంకి తదితర ప్రాంతాల్లోకి వచ్చి తలదాచుకుంటున్నారు. తరచూ అల్లర్లు.. అర్ధరాత్రి వేళ రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. పెనమలూరు ఠాణాలో సిబ్బంది కొరత.. తూతూమంత్రంగా గస్తీలు తిరుగుతుండడంతో గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ