మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక కోస్తాంధ్ర తెలంగాణ వరకు ద్రోణి విస్తరణ
మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక కోస్తాంధ్ర తెలంగాణ వరకు ద్రోణి విస్తరణ
rain


విశాఖపట్నం, 11 జూన్ (హి.స.)

మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మి.మీ., లావేరులో 64.5 మి.మీ. వర్షపాతం నమోదైందన్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande