
అమరావతి, 11 జూన్ (హి.స.)
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్, హవాలా జరిగినట్లు గుర్తించిన ఈడీ.. విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్తో పాటు పది చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజ్ కసిరెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు మరికొందరు అనుమానితుల ఇళ్లల్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకుంది. లిక్కర్ స్కామ్, మద్యం రవాణా కేసుల్లో రాజ్ కసిరెడ్డిని ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఈడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడలోని సిట్ నాలుగు ఛార్జ్షీట్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ