రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కే వెన్నుపోటు పొడిస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటి..? హరీష్ రావు
హైదరాబాద్, 11 జూన్ (హి.స.) రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి దగ్గర వ్యక్తికి టీపీసీసీ వర్కింగ్ ప్రె
Harish Rao


హైదరాబాద్, 11 జూన్ (హి.స.)

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి దగ్గర వ్యక్తికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వనందుకే మీనాక్షి నటరాజన్ కేసు విషయాన్ని బయటకు లీక్ చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.

ఈ విషయమై హరీశ్ రావు మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కారణం అని మధ్యప్రదేశ్ మంత్రి అంటున్నాడు. రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తే మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పొడిచారని మాకు సమాచారం వచ్చిందన్నారు.

తన దగ్గర వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్కు అడిగితే, ఆమె ఒప్పుకోకపోవడతో ఆమెకు వెన్నుపోటు పొడిచారని సమాచారం ఉందన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్్క వెన్నుపోటు పొడిస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటని.. దీనిపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande