మరోసారి గాంధీ భవన్ కు చేరిన కామారెడ్డి . పంచాయతీ
మరోసారి గాంధీ భవన్ కు చేరిన కామారెడ్డి . పంచాయతీ
మరోసారి గాంధీ భవన్ కు చేరిన కామారెడ్డి . పంచాయతీ


హైదరాబాద్, 11 జూన్ (హి.స.)

కామారెడ్డి పంచాయితీ మరోసారి గాంధీభవన్కు చేరింది. ఈరోజు(గురువారం) పార్టీ నేత చంద్రశేఖర్ రెడ్డి.. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. సీనియర్ నేత షబ్బీర్ అలీ వల్లనే కామారెడ్డిలో 20 ఏళ్లుగా పార్టీ గెలవడం లేదని చెప్పారు. గత 20 రోజులుగా కామారెడ్డి పంచాయితీ.. కాంగ్రెస్ పార్టీలో హైటెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది. సీనియర్ నేత షబ్బీర్ అలీ, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం చెలరేగింది. వీరిద్దరూ రెండు గ్రూప్లుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. పార్టీకి నష్టం చేస్తున్నారంటూ షబ్బీర్ అలీపై చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. అలాగే చంద్రశేఖర్ తనను తిట్టారంటూ షబ్బీర్ అలీ ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande