మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట : మంత్రి సీతక్క
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట : మంత్రి సీతక్క
Seethaka


ములుగు, 11 జూన్ (హి.స.)

రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తుందని మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం గోవిందరావుపేట మండలం లక్నవరం గ్రామంలో మహిళా సంఘాల సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలోని ఆరు మహిళా సంఘాల సమాఖ్య భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, భవనాలు నిర్మాణాలు పూర్తయిన అనంతరం మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, పొదుపు-రుణాల నిర్వహణ, జీవనోపాధి కార్యకలాపాల అమలుకు శాశ్వత కేంద్రాలుగా ఉపయోగపడనున్నాయని అభిప్రాయపడ్డారు. మహిళా సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తున్నాయని, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను మరింతగా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande