ఖమ్మం మైనర్ అత్యాచార ఘటన.. బాధితురాలిని పరామర్శించిన మంత్రి తుమ్మల
ఖమ్మం మైనర్ అత్యాచార ఘటన.. బాధితురాలిని పరామర్శించిన మంత్రి తుమ్మల
Minister


ఖమ్మం, 11 జూన్ (హి.స.)

ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన

అత్యాచార ఘటన బాధితురాలిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. నిందితుడు రెండో అంతస్తు నుండి బాలికను తోలివేయడంతో తీవ్రగాయాలు అయ్యాయని చెప్పారు. బాలిక కాళ్లు, చేతులకే కాకుండా వెన్నుముకకు సైతం గాయాలు అయ్యాయని చెప్పారన్నారు. కోలుకోవడానికి కనీసం రెండు నెలలు సమయం పడుతుందని అన్నారు. ఎంత ఖర్చు అయినా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తామని, ప్రభుత్వమే ఖర్చు భరించి వైద్యం అందిస్తుందని అన్నారు. బాధితురాలి కుటుంబానికి కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇది మానవమృగం లాంటి వ్యక్తి చేసిన దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande