మోయినాబాద్ ఫాం హౌస్ జంట హత్యల కేసు నిందితురాలు కరీమాబేగం ఆత్మహత్యాయత్నం.
మోయినాబాద్ ఫాం హౌస్ జంట హత్యల కేసు నిందితురాలు కరీమాబేగం ఆత్మహత్యాయత్నం.
Farmhouse


హైదరాబాద్, 11 జూన్ (హి.స.)

మోయినాబాద్ ఫాం హౌస్ జంట హత్యల కేసులోని నిందితురాలు కరీమాబేగం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన తాండూరు జంట మహిళల దారుణ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కరీమా బేగం విచారణలో భాగంగా కరణ్ కోట్ పోలీస్టేషన్కు తరలించారు. విచారణలో ఉండగా బాత్రూంలోకి వెళ్లి యాసిడ్ తాగి కరీమాభేగం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

అదే రోజు పోలీసులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో 24 రోజులుగా చికిత్స పొందుతున్న కరీమాభేగం రాత్రి మృతి చెందినట్లు తెలిసింది. మొయినాబాద్ జంట హత్య కేసులో కరీమాబేగంతో పాటు ఆమె భర్త రెహమాన్, నయూం అనే వ్యక్తి కూడా నిందితులుగా ఉన్నారు. వీరి పన్నాగంలో పడి మహబూబీ బేగం, అబేదా భేగం అనే మహిళలు హత్యకు గురయ్యారు. మరోవైపు ఠాణాలో కరీమాబేగం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో వికారాబాద్ జిల్లా ఎస్పీ ఇద్దరు కానిస్టేబుళ్ల పై సస్పెన్షన్ వేటు వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande