కామారెడ్డి లో కలకలం.. ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం..
కామారెడ్డి లో కలకలం.. ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం..
Kamareddy


కామారెడ్డి, 11 జూన్ (హి.స.)

షాపింగ్ కోసం వెళ్ళిన తల్లి, కొడుకు,

ఇద్దరు కూతుళ్లు మిస్సింగ్ అయిన సంఘటన కామారెడ్డి పట్టణంలో కలకలం సృష్టిస్తోంది. స్థానిక పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన యాడారం లయ అలియాస్ శ్యామల (31), ఆమె కూతుళ్లు బిందు (17), దివిజ (8), కొడుకు శివ (13)తో కలిసి బుధవారం మధ్యాహ్నం కామారెడ్డి పట్టణంలో షాపింగ్ నిమిత్తం వెళ్లిందరన్నారు. షాపింగ్ ముగించుకుని ఆమె సోదరుని ఇంటికి వెళ్లి లంచ్ చేసి సాయంత్రం ఇంటికి వెళుతున్నామని చెప్పి ఆటోకి వెళ్లిందన్నారు. అయితే రాత్రి 8 గంటల వరకు బస్సుకు ఇంటికి వస్తామని చెప్పినప్పటికీ ఇంటికి వెళ్లలేదని, దీంతో ఆమె భర్త భాను ప్రకాష్ తన భార్య, ముగ్గురు పిల్లలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande