రోడ్డుపై పారతున్న మురుగునీటిని తొలగింపు
రోడ్డుపై పారతున్న మురుగునీటిని తొలగింపు
anthapuram/removal-of-sewage-from-the-road-1531546


బొమ్మనహాళ్, 11 జూన్ (హి.స.) బొమ్మనహాళ్ మండలంలోని తార్కాపురం గ్రామంలో రోడ్డుపై పారతున్న మురుగునీటిని తొలగించేందుకు పంచా యతీ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామంలో మురుగునీరు రహదా రిపై ప్రవహిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుండేది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఇనచార్జ్ కార్యదర్శి పల్లవి చర్యలు చేపట్టారు. ఎక్స్కవేటర్ సాయంతో రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన మట్టిని తొలగించి, మురుగునీరు సాఫీగా వెళ్లేలా కాలువలను శుభ్రం చేయిం చారు. గ్రామంలో ఈ నెల 16న మహాలక్ష్మి రథోత్సవం జరగనుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండ టంతో గ్రామంలో పారిశుఽ ద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కార్యదర్శి పల్లవి తెలిపారు. రోడ్డుపై మురుగు తొలగించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande