పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
Mla


కామారెడ్డి, 12 జూన్ (హి.స.)

పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిలుస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. రాజంపేట మండల కేంద్రలోని రైతు వేదికలో శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 10 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ అందుబాటు లో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శృతి, మండల ప్రెసిడెంట్ సంపత్ రెడ్డి, సర్పంచులు దుబ్బాని శ్రీకాంత్, కామిశెట్టి నరేష్, గర్గుల బాబు, కర్నాల లక్ష్మి, గిర్దావర్ లక్ష్మయ్య, మండల అధికారులు, జీపీఓలు, గ్రామాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande