పాఠ్యపుస్తకాల పంపిణీ ని వేగవంతం చేయాలి.. పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలాస్
పాఠ్యపుస్తకాల పంపిణీ ని వేగవంతం చేయాలి.. పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలాస్
School education


హైదరాబాద్, 12 జూన్ (హి.స.)

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ చేరవేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో విద్యాశాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు అందిస్తున్న వర్క్ బుక్స్ 2026-27 విద్యా సంవత్సరం 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సైతం కొత్తగా వర్క్ బుక్స్ పంపిణీ చేయనున్నారు. అభ్యాసన బుక్స్ సామర్థ్యాలు పెరగడానికి వర్క్ ఉపయోగపడుతాయని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకులాల్లోని 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు సుమారు 12 లక్షల మంది వరకు ఉంటారు. అయితే వర్క్ బుక్స్ ఈ నెలాఖరు లేదా జులై మొదటివారంలో అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలు ఇప్పటికే మండల కేంద్రాల నుంచి స్కూళ్లకు చేరుకోగా నోట్ బుక్స్ ఇంకా చేరలేదు. పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే పలు సూచనలు చేసింది.

పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ డీఈఓలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రవాణా, పంపిణీలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా రోజువారీ సరఫరా నివేదికలను ట్రాక్ చేయాలని స్పష్టం చేశారు. గతేడాది నాగర్కర్నూల్ జిల్లాలో విద్యార్థులతో కలిసి బుక్స్ ట్రాలీలో తీసుకొస్తుండగా బోల్తా పడింది. అందులో విద్యార్థులు ఉండడాన్ని విద్యాశాఖ సీరియస్గా తీసుకుంది. ఈ ఏడాది అలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని, పాఠశాల ప్రారంభం నాటికే బుక్తోపాటు అన్ని మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande