ఒక్క సీటు కోసం ఇంతలా దిగజారాలా.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్
ఒక్క సీటు కోసం ఇంతలా దిగజారాలా.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్
Jagga Reddy


హైదరాబాద్, 12 జూన్ (హి.స.)

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్

(Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవాళ ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని (EC) అడ్డం పెట్టుకుని కుట్రపూరితంగానే వ్యవహరించిదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగిన మహిళా నాయకురాలని అన్నారు. అలాంటి లీడర్ రాజ్యసభ నామినేషను మధ్యప్రదేశ్లో తిరస్కరించడం అత్యంత అన్యాయమని అన్నారు. తనకు తెలిసినంత వరకు ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, కోర్టుల్లో ఎలాంటి వివాదాలు పెండింగ్లో లేవన్నారు. కనీసం ఆమె రాజకీయ జీవితంలో ఎలాంటి నిరసనలు, రాస్తారోకోలు, రాజకీయ గొడవల్లో పాల్గొన్నట్లుగా కూడా రికార్డుల్లో లేదన్నారు. ఆమె వ్యక్తిగత జీవితంలోనూ ఎలాంటి చట్టపరమైన సమస్యలు లేకుండా.. అంతటి క్లీన్ రికార్డ్ ఉన్న నేతను రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande