తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
I set


హైదరాబాద్, 12 జూన్ (హి.స.)

తెలంగాణ ఐసెట్ ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకిష్టారెడ్డి ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. అభ్యర్థులు తమ హాల్టికెట్ నంబర్ను ఎంటర్ చేసి ర్యాంక్ కార్డుని పొందొచ్చని ఉన్నతాధికారులు సూచించారు. అయితే, గత నెల 13, 14 తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన ఉన్నత విద్యా మండలి ఇవాళ ఫలితాలను విడుదల చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande