విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి
విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి
విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి


అమరావతి, 12 జూన్ (హి.స.)

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా దెబ్బతిన్న విద్యుత్ రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విజయవంతంగా పునరుద్ధరించిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థలో సృష్టించిన విధ్వంసాన్ని కేవలం రెండేళ్లలోనే సరిదిద్ది, పట్టాలెక్కించామని పేర్కొన్నారు.గత రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదని... రాబోయే మూడేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వినియోగదారులపై అదనపు భారం మోపిన 'ట్రూ అప్' విధానానికి స్వస్తి పలికి, చరిత్రలోనే మొదటిసారిగా 'ట్రూ డౌన్' విధానాన్ని తీసుకువచ్చామని తెలిపారు. దీని ద్వారా యూనిట్కు 13 పైసల చొప్పున ఛార్జీలను తగ్గించి, ప్రజలకు రూ. 4,498 కోట్ల మేర ఉపశమనం కలిగించామని వెల్లడించారు

గత రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదని... రాబోయే మూడేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వినియోగదారులపై అదనపు భారం మోపిన 'ట్రూ అప్' విధానానికి స్వస్తి పలికి, చరిత్రలోనే మొదటిసారిగా 'ట్రూ డౌన్' విధానాన్ని తీసుకువచ్చామని తెలిపారు. దీని ద్వారా యూనిట్కు 13 పైసల చొప్పున ఛార్జీలను తగ్గించి, ప్రజలకు రూ. 4,498 కోట్ల మేర ఉపశమనం కలిగించామని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande