'యోగాంధ్ర 2026'లో భాగంగా సామూహిక యోగా కార్యక్రమం
'యోగాంధ్ర 2026'లో భాగంగా సామూహిక యోగా కార్యక్రమం
'యోగాంధ్ర 2026'లో భాగంగా సామూహిక యోగా కార్యక్రమం


నెల్లూరు, 12 జూన్ (హి.స.)

యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్న యోగాంద్ర 2026 కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి.యోగ ద్వారా శారీరకదారుఢ్యం, మానసిక ప్రశాంతత, ఏకగ్రతతో పాటు, సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని యోగా గురువులు పేర్కొన్నారు.

యోగాంధ్ర (2026) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శుక్రవారం ఉదయం నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద సామూహిక యోగా (thematic) కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.. స్థానిక మహిళలు, అధికారులు, యోగాభ్యాసకులతో కలిసి యోగాసనాలు వేసిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, నగరమేయర్ సుజాత పలువురు ప్రముఖులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande