తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి సంచారం
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి సంచారం
చిరుతపులి సంచారం


తిరుపతి, 12 జూన్ (హి.స.)

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. యూనివర్సిటీలోని చొప్పల రత్నం బిల్డింగ్, ఐ బ్లాక్, జి బ్లాక్ మధ్య చిరుతపులి తిరుగుతున్నట్టు సిబ్బంది గుర్తించారు. దీంతో అటవీ అధికారులు అక్కడకు బయలుదేరగా వాళ్లు వచ్చేలోపే చిరుతపులి తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో యూనివర్సిటీ, పరిసర ప్రాంతాల్లలో చిరుతల సంచారం కామన్ అయిపోయింది. తరచూ చిరుతలు యూనివర్సిటీ ప్రాంగణంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా వెటర్నరీ యూనివర్సిటీ, వేద విశ్వవిద్యాలయం పరిసరాలు, సిబ్బంది క్వార్టర్స్ లో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే అవి ఆహారం కోసం వచ్చే కుక్కలను అనుసరిస్తూ వస్తున్నాయని అధికారులు గుర్తించారు. చిరుతల నుండి రక్షించేందుకు ఎప్పటికప్పుడు వాటి కదలికలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ సంచరిస్తున్నట్టు తెలిస్తే బోన్లు ఏర్పాటు చేసి నిర్భందిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande