ఆ లోటు తీర్చారు.. పవన్ కల్యాణ్పై లోకేశ్ ప్రశంసలు
ఆ లోటు తీర్చారు.. పవన్ కల్యాణ్పై లోకేశ్ ప్రశంసలు
పవన్ కల్యాణ్


తిరుపతి, 12 జూన్ (హి.స.)

తనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) అన్న లేని లోటు తీర్చారని మంత్రి లోకేశ్(Minister Lokesh) ప్రశంసించారు. తిరుపతి(Tirupati) బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. పవన్ కల్యాణ్ సినిమాలో పవర్ స్టార్ అని.. రాజకీయాల్లో జనసేనాని అని కొనియాడారు. ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో కూడా పవన్ కల్యాణ్కు తెలుసు అని చెప్పారు. తిరుపతి వెంకన్న సాక్షిగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుందని.. ఈ రెండేళ్లు రాష్ట్రం ప్రశాంతంగా ఉందని లోకేశ్ వ్యాఖ్యానించారు.

ఈ రెండేళ్లలో బూతులు, జేసీబీలు, మర్డర్లు, దాడులాంటివి లేవని మంత్రి లోకేశ్ తెలిపారు. వెంకటేశ్వరస్వామితో పెట్టుకోవద్దని గత సీఎంకు చెప్పానని, కానీ వినింపించుకోలేదని మండిపడ్డారు. ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క మాస్క్ అడిగిన పుణ్యానికి ప్రాణాలే లేకుండా చేశారని మండిపడ్డారు. దళిత డ్రైవర్ను చంపేసి డైరెక్ట్ గా ఇంటికే డోర్ డెలివరీ చేశారని సుబ్రహ్మణ్యం హత్యోదంతాన్ని మంత్రి లోకేశ్ గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ జెండానే లేకుండా చేస్తామని సవాల్ విసిరారని, ఇప్పుడు 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్షం హోదా కూడా లేకుండా ఉన్నారని మంత్రి లోకేశ్ విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande