
తిరుపతి, 12 జూన్ (హి.స.)కూటమి గెలుపు ఏపీ సమాజానికి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలోని దామినీడులో నిర్వహించిన కూటమి రెండేళ్ల పాలన సభలో ఆయన మాట్లాడుతూ.. 2024లో ప్రజలు భయాన్ని, అహంకారాన్ని తిరస్కరించారని అన్నారు. ప్రజలు మౌనంగా కనిపించినా అవసరం వచ్చినప్పుడు చరిత్రను మార్చగలరని నిరూపించారన్నారు. రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది అధికారం కాదని, బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఈ విజయం కేవలం బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలది కాదని ప్రజల విజయం అని అన్నారు. ఈ కూటమి అధికారాన్ని పంచుకోవడానికి ఏర్పడింది కాకుండా బాధ్యతను పంచుకోవడానికి ఏర్పడిందని అన్నారు.
కూటమిలో జనసేన 21 సీట్లు సర్దిపెట్టుకున్న సమయలో చాలా మంది విమర్శించారని చెప్పారు. కానీ తాము ఏపీ భవిష్యత్ కోసమే జనసేనను 21సీట్లకు పరిమితం చేశామని అన్నారు. గ్రామ సమస్యలకు పరిష్కారం గ్రామంలోనే వెతకాలని సూచించారు. ప్రజల జీవితాల్లో సమస్యలను ప్రజల్లోనే వెతకాలని అన్నారు. అందుకే గ్రామసభలను కేవలం అధికారిక సమావేశంలా కాకుండా గ్రామ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువు కావాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV