అనంతపురంలో విషాదం!!! గొడవ ఆపబోయాడు.. ప్రాణాలు కోల్పోయాడు!
అనంతపురంలో విషాదం!!! గొడవ ఆపబోయాడు.. ప్రాణాలు కోల్పోయాడు!
‘గొడవ ఆపబోయాడు.. ప్రాణాలు కోల్పోయాడు!


అనంతపురం, 12 జూన్ (హి.స.)

అనంతపురంలోని శివారు ప్రాంతం కళ్యాణదుర్గం రోడ్డులో చంద్రశేఖర్ అనే 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. కూరగాయల కొనుగోలు విషయంలో ఇద్దరు మందుబాబులు దుకాణం వద్ద గొడవ పడుతున్నారు. ఈ గొడవను నిలవరించటానికి పక్కనే ఉన్న చంద్రశేఖర్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు.

ఆగ్రహంతో ఊగిపోతున్న మందుబాబులు చంద్రశేఖర్ ని పక్కకు తోశారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ వేగంగా కిందకు పడటంతో ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మందుబాబులు అక్కడి నుంచి పరారయ్యారు.. సంఘటన స్థలానికి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీకాంత్ తన సిబ్బందితో చేరుకొని పరిశీలించారు. చంద్రశేఖర్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ టాక్సీ డ్రైవర్ గా చంద్రశేఖర్ పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande