అరకులోయ.లోని.ప్రాంతీయ వైద్య కేంద్రం ఆవరణలో ఉపముఖ్యమతి.సొంత 95 లక్షలతో బ్లడ్ బ్యాంక్
అరకులోయ, 13 జూన్ (హి.స.) , : అరకులోయలో బ్లడ్బ్యాంక్ ఏర్పాటుతో గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ నిశాంతి పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సొంత నిధులు రూ. 95 లక్షలతో అరకులోయలోని ప్రాంతీయ వైద్యకేంద్రం ఆవరణలో బ్లడ్బ్
అరకులోయ.లోని.ప్రాంతీయ వైద్య కేంద్రం ఆవరణలో ఉపముఖ్యమతి.సొంత 95 లక్షలతో బ్లడ్ బ్యాంక్


అరకులోయ, 13 జూన్ (హి.స.)

, : అరకులోయలో బ్లడ్బ్యాంక్ ఏర్పాటుతో గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ నిశాంతి పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సొంత నిధులు రూ. 95 లక్షలతో అరకులోయలోని ప్రాంతీయ వైద్యకేంద్రం ఆవరణలో బ్లడ్బ్యాంక్ భవన నిర్మాణానికి శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల నుంచి రక్తహీనత, సికెల్సెల్ ఎనీమియా వంటి వ్యాధులతో వచ్చే రోగులకు బ్లడ్బ్యాంక్ ఏర్పాటుతో సాంత్వన కలుగుతుందన్నారు. అరకులోయ ప్రాంతీయ వైద్య కేంద్రంలో అంబులెన్స్ కొరతని తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ సమన్వయకర్త నీలవేణి, వైద్యాధికారి రాము, శోభారాణి, కూటమి నాయకులు చిరంజీవి, దేవదాస్, సుబ్బారావు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande