ఈనెల 17న పునఃప్రారంభం కానున్న మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం
ఈనెల 17న పునఃప్రారంభం కానున్న మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం
Minister


హైదరాబాద్, 15 జూన్ (హి.స.)

ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజలను కలిసి వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించి సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన 'మంత్రులతో ముఖాముఖి' కార్యక్రమం మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఈనెల 17న గాంధీ భవన్లో పునఃప్రారంభం కాబోతోంది. గతంలో ప్రతి బుధవారం గాంధీభవన్లో ప్రజలతో ఒక మంత్రి ముఖాముఖి కలిసేవారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించేవారు. ఈ క్రమంలో ఎల్లుండి నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. వచ్చే బుధవారం మంత్రి అజారుద్దీన్ ముఖాముఖీలో పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా గాంధీభవన్ లో నిర్వహిస్తూ వచ్చిన ఈ ముఖాముఖి కార్యక్రమం మంత్రుల బిజీ షెడ్యూల్తో పాటు కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు, మధ్యలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజీ కారణంగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. ఆ తర్వాత ఈ కార్యక్రమం పట్ల అంతా సైలెంట్ అయిపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande