ఎన్టీఆర్ జిల్లా.నందిగామ లో.కొత్త తరహా మోసం
ఎన్టీఆర్ జిల్లా.నందిగామ లో.కొత్త తరహా మోసం
ఎన్టీఆర్ జిల్లా.నందిగామ లో.కొత్త తరహా మోసం


ఎన్టీఆర్, 15 జూన్ (హి.స.)

, :ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లిస్తానంటూ ఓ వ్యక్తి నుంచి ఫొన్ తీసుకున్న మాయగాడు క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయాడు. ఆపై ఫోన్ ద్వారా దాదాపు రూ.99 వేల నగదును కాజేశాడు. పట్టణంలోని పాత బస్టాండ్లోని ఓ ఎలక్ట్రికల్ షాపునకు ఓ వ్యక్తి వచ్చాడు. అక్కడే కొన్ని సామాన్లు కొనుగోలు చేసిన సదరు వ్యక్తి ఆన్లైన్ ద్వారా బిల్ చెల్లిస్తానని చెప్పాడు. అయితే తన ఫోన్ స్విచ్ఆఫ్ అయ్యిందంటూ షాపు యజమానిని ఫోన్ అడిగాడు.

ఇంతలో ఆ యజమానికి ఓ నంబర్ ఇచ్చి దానికి ఒక్క రూపాయి పంపమని కోరాడు. అతను చెప్పిన నంబర్కు ఫోన్ పే ద్వారా ఒక్క రూపాయి పంపించాడా యజమాని. అయితే.. ఫోన్పే ఎలా ఉపయోగిస్తున్నాడో ఆ వ్యక్తి గమనించి.. పిన్ నంబర్ నోట్ చేసుకున్నాడు. ఆపై అవతలి వ్యక్తికి కాల్ చేసి రూపాయి వచ్చిందో, లేదో తెలుసుకుంటానని చెప్పి యజమాని నుంచి ఫోన్ తీసుకున్నాడా కేటుగాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో షాపు యజమాని షాక్కు గురయ్యాడు. కేటుగాడు.. షాప్ యజమాని ఫోన్పే ఖాతా ద్వారా సుమారు రూ.99,000 వరకు లావాదేవీలు జరిపాడు. ఈ ఘటనపై బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం సహా తన బ్యాంక్ ఖాతాలను నిలిపివేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande