
అమరావతి, 15 జూన్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ )తో ఈరోజు (సోమవారం) మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక రంగ సహకారం, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కీలక అంశాలపై చర్చించారు.
ఏపీ అభివృద్ధికి అవసరమైన టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో సహకారం అందించాలని సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రధానిని కోరారు. ముఖ్యంగా సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధి, నైపుణ్యాల పెంపు (కెపాసిటీ బిల్డింగ్) అంశాల్లో సింగపూర్ మద్దతు అవసరమని వివరించారు. అమరావతి సహా రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో అర్బన్ గవర్నెన్స్, నగర ప్రణాళిక, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వామ్యం కావాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సింగపూర్ ప్రధాని ప్రత్యేక ఆసక్తి చూపించారు. విద్యాసంస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న మౌలిక సదుపాయాల నిర్మాణాల గురించి లారెన్స్ వాంగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ