'తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఉన్నత స్థాయికి ఎదగాలి'.. విద్యార్థులకు మంత్రి పొన్నం పిలుపు
'తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఉన్నత స్థాయికి ఎదగాలి'.. విద్యార్థులకు మంత్రి పొన్నం పిలుపు
పొన్నం


హైదరాబాద్, 15 జూన్ (హి.స.)

వేసవి సెలవుల అనంతరం

పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల అల్పాహారం పాలు పథకాన్ని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఖైరతాబాద్లోని రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యశస్వినీ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, డీఈవో యాదయ్య, మన్నా ట్రస్ట్ సీఈవో లీనా జోసెఫ్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 29 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం, ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తోడ్పడడం, పాఠశాల హాజరును పెంచడం, డ్రాస్అవుట్లను తగ్గించడం, విద్యా ఫలితాలను మెరుగుపరచడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలంటే విద్యా ప్రమాణాలు మెరుగుపడాలని, అందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని చెప్పారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఉదయాన్నే పాఠశాలకు వచ్చి అల్పాహారం తీసుకోవడంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా పాఠశాలలోనే చేయాలని సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande