
హైదరాబాద్, 15 జూన్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన
విద్యా సంవత్సరం(New academic year) నేడు ప్రారంభమైంది. వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి బడి బాట పట్టిన విద్యార్థులందరికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాలల పునఃప్రారంభాన్ని పురస్కరించుకుని విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలిపారు. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని, అందుకే అత్యున్నత ప్రమాణాలతో రాష్ట్రంలో విద్యారంగం విలసిల్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిందని సీఎం గుర్తు చేశారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడంతో పాటు విద్యా ప్రమాణాలు పెంచేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు.
పాఠశాల అనేది కేవలం చదువులు నేర్చుకునే స్థలం మాత్రమే కాదని.. మన వ్యక్తిత్వాన్ని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్ర ఆలయమని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ప్రతి పుస్తకం ఒక కొత్త ప్రపంచానికి తలుపు లాంటిదని, ప్రతి పాఠం ఒక కొత్త అవకాశానికి మార్గమని అన్నారు. ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు