
తిరుమల, 13 జూన్ (హి.స.)
: వేసవి సెలవులు ముగిస్తుండటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుమల గిరులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండాయి. స్వామివారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం సర్వదర్శన భక్తులను బాట గంగమ్మ ఆలయం నుంచి సర్వదర్శన క్యూలైన్లోకి అనుమతిస్తున్నారు. కూలైన్లలో భక్తులకు అల్పాహారం, తాగు నీరు, పాలు వంటివి శ్రీవారి సేవకుల ద్వారా అధికారులు అందజేస్తున్నారు. సీఆర్వో వద్ద వసతి గదుల కోసం, కళ్యాణకట్ట కేంద్రాల వద్ద భక్తులు బారులు తీరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ