సనత్నగర్ లో ఓ మహిళా పైలెట్ కు వేధింపులు
సనత్నగర్ లో ఓ మహిళా పైలెట్ కు వేధింపులు
సనత్నగర్ లో ఓ మహిళా పైలెట్ కు వేధింపులు


హైదరాబాద్, 13 జూన్ (హి.స.)

సనత్నగర్లో ఓ మహిళా పైలట్కు వేధింపుల ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కల్ట్ జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్గౌడ్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిమ్ ట్రైనింగ్ పేరుతో తనను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడని, ఒప్పుకోకపోవడంతో ఇన్స్టాలో తనపై అసభ్య మెసేజ్లు పెట్టారని మహిళా పైలట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మేనేజర్ సంతోష్గౌడ్కు అతని గర్ల్ ఫ్రెండ్ రజనీ సహకరించిందని పోలీసులకు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande