రాష్ట్రంలోని.విద్యాసంస్థలు ఈ.నెల 15 నుంచి ప్రారంభం
రాష్ట్రంలోని.విద్యాసంస్థలు ఈ.నెల 15 నుంచి ప్రారంభం
రాష్ట్రంలోని.విద్యాసంస్థలు ఈ.నెల 15 నుంచి ప్రారంభం


హైదరాబాద్, 13 జూన్ (హి.స.)

రాష్ట్రంలోని విద్యాసంస్థలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మన్సూరాబాద్, నాగోల్, జీఎస్ఐ డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ముస్తాబవుతున్నాయి. ఇందులో భాగంగా తమ పాఠశాలల పరిధిలో విద్యార్థుల సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా కొన్ని రోజులుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సహా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి బడి ఈడు పిల్లలను స్కూలులో చేర్పించాలని సూచిస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే సదుపాయాలు, సౌకర్యాలను వారికి వివరిస్తూ ‘బడి బాట’ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం నుంచి బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో నెలకొన్న సమస్యలు, శుభ్రత పనులపై ప్రత్యేక కథనం.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande