ప్రజల భద్రతతో పాటు సంక్షేమానికి కృషి : ఆసిఫాబాద్ ఎస్పీ నితిక పంత్
ప్రజల భద్రతతో పాటు సంక్షేమానికి కృషి : ఆసిఫాబాద్ ఎస్పీ నితిక పంత్
SP


ఆసిఫాబాద్, 13 జూన్ (హి.స.)

ప్రజల భద్రతతో పాటు వారి సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ పని చేస్తోందని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా శనివారం తిర్యాణి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ స్మార్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో గిరిజనులకు 87 సోలార్ లైట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ఇటువంటి సామాజిక ఉపయోగకరంగా సేవాకార్యక్రమాలు ఎంతో ఉంటాయన్నారు.

విద్యుత్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో సోలార్ లైట్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారతాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఆదాకు కూడా సోలార్ శక్తి దోహదపడుతుందని పేర్కొన్నారు. పోలీస్ శాఖ కేవలం చట్ట అమలు. శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా ప్రజల సంక్షేమం, భద్రత, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుందని తెలిపారు. అలాగే రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు చేపడుతునే సమాజ సేవలో భాగస్వాములవుతామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande