గోల్కొండ పోలీస్ స్టేషన్.పరిదిలో చెల్లిని వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
గోల్కొండ పోలీస్ స్టేషన్.పరిదిలో చెల్లిని వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
గోల్కొండ పోలీస్ స్టేషన్.పరిదిలో చెల్లిని వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు


హైదరాబాద్, 13 జూన్ (హి.స.)

తమ చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బావ ఆమెను వేధిస్తున్నాడనే కోపంతో బావమరుదులే హత్య చేశారు. గోల్కొండ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుమ్మర్వాడీకి చెందిన షేక్ మెహబూబ్ (26) అలియాస్ గోల్కొండ చాందీ మసూద్ ఎలక్ట్రీషియన్తో పాటు యూట్యూబర్గా ఉన్నాడు. 2025 జనవరిలో అదేప్రాంతానికి చెందిన రుక్సా(22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. పెళ్లైన ఆరునెలల వరకు సంసారం సాఫీగా. చెల్లిని వేధిస్తున్నాడని.బావను సాగింది. కొద్ది నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రుక్సా సోదరుడు సొహేల్ ఆమెను పుట్టింటికి తీసుకెళ్లాడు. సొహేల్ అతని కజిన్ జాబేర్తో కలిసి మెహబూబ్ ఇంట్లో ఉండగా అతని తలపై రాడ్తో దాడి చేసి కత్తితో పొడిచారు. దీంతో రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande