హైదరాబాద్ వాసులకు బిగ్ రెయిన్ అలర్ట్..
హైదరాబాద్ వాసులకు బిగ్ రెయిన్ అలర్ట్..
Rain


హైదరాబాద్, 13 జూన్ (హి.స.)

శనివారం సాయంత్రం జీహెచ్ఎంసీ

పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్సుందని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నేడు ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 60-90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది. ముఖ్యంగా శేరిలింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షసూచన నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

మొయినాబాద్, శంకరపల్లి, మోకిల, కొల్లూరు, తెల్లాపూర్, నాగులపల్లి, నల్లగండ్ల, పటాన్ చెరు, బీహెచ్ఎల్, ఆర్ సీ పురం, అమీన్ పూర్, కోకాపేట్, మణింకొడ, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో ఇప్పటికే జల్లులు, మోస్తరు వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వాతావరణ విభాగం తెలంగాణకు భారీ వర్షసూచన చేసింది. కొన్ని జిల్లాలకు రెడ్, మరికొన్నింటికి ఆరెంజ్, ఎల్ల్ అలర్ట్ లు జారీ చేసింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సిద్ధిపేట, జగిత్యాల, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దక్షిణ తెలంగాణలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఆయా జిల్లాల్లో రేపు, ఎల్లుండి.. ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు కురిసే సమయంలో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉండటంతో.. జాగ్రత్తగా ఉండాలని కోరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande