
అమరావతి, 13 జూన్ (హి.స.)
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వేదవతి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుల్యం గ్రామం వద్ద వేదవతి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం డీపీఆర్ తయారుచేసే బాధ్యతను వాప్కోస్ కు అప్పగిస్తూ జలవనరులశాఖ ఉత్తర్వులు జారీచేసింది. డీపీఆర్ వచ్చాక నిధుల విడుదలపై దృష్టి సారిస్తుంది. 80వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఉద్దేశించిన ఈ పథకానికి అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు సాధించే బాధ్యతనువాప్కోస్ అప్పగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ