
గుంటూరు, 13 జూన్ (హి.స.)
సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి నోరు పారేసుకున్నారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైసీపీ శుక్రవారం గుంటూరులో నిరసన కార్యక్రమం చేపట్టింది. కొరిటెపాడులో జరిగిన ధర్నాలో డీఎస్సీ పేరుతో దిష్టిబొమ్మను దహనం చేసేందుకు అంబటి రాంబాబు, వైసీపీ నాయకులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవటంతో.. ‘ఇది చంద్రబాబు దిష్టిబొమ్మ కాదు.. వాడిని ఎప్పుడో తగలేశాం’ అంటూ అంబటి నోరు పారేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ