
అనంతపురం, 13 జూన్ (హి.స.)
అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి సమీపంలో ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కొడవళ్లతో దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఆచారి మణికంఠ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బుక్కరాయసముద్రం మండలం, బొమ్మలాటపల్లి సమీపం.
చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఆచారి మణికంఠ.ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. తీవ్ర రక్తస్రావమైన మణికంఠను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ దాడికి పాత కక్షలేమైనా కారణమా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దాడికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV