ప్రొద్దుటూరు తనకంటి జువెలర్స్ వద్ద మహిళలు నిరసన
ప్రొద్దుటూరు తనకంటి జువెలర్స్ వద్ద మహిళలు నిరసన
ప్రొద్దుటూరు తనకంటి జువెలర్స్ వద్ద మహిళలు నిరసన


ప్రొద్దుటూరు, 13 జూన్ (హి.స.)

కడప జిల్లా లోని ప్రొద్దుటూరు పట్టణాన్ని రెండో మైసూర్ గా పిలుచుకుంటారు. అటువంటి ప్రొద్దుటూరు పట్టణంలో నేడు తనకంటి జ్యువెలర్స్ వద్ద యాజమాన్యం చేసిన మోసానికి మహిళలు నిరసన. తనకంటి జ్యువెలర్స్ యాజమాన్యం స్థానిక మహిళలు ఖాతాదారుల నుంచి నెలవారి వాయిదా పద్ధతిలో డబ్బులు వసూలు చేసి తమకు బంగారు నగల స్క్రీమ్ రూపంలో ఇస్తామని తనకంటి జ్యువెలర్స్ వారు చెప్పిన గడువు ముగిసిన కూడా తమకు బంగారు ఇవ్వ కుండా కాలయాపన చేస్తున్నారని మహిళలు తీవ్ర ఆందోళన చెందారు.

తాము కష్టపడి దాచుకున్న డబ్బును తనికంటి జువెలర్స్ వారికి ఇచ్చి మోసపోయామంటూ నిరసన చేస్తూ ఆవేదన చెందిన మహిళలు. తనకంటి జ్యువెలర్స్ దుకాణం వద్ద యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నమ్మకమైన దుకాణం అని చెప్పి లక్షలాది రూపాయలు కట్టిన తమను రోడ్డు పడేయడంపై మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకంటి జువెలర్స్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బంగారు దుకాణం వద్ద పోలీసులను మహిళలు వేడుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande