
హైదరాబాద్, 14 జూన్ (హి.స.) సొంత అక్క, ఆమె భర్త, వారి కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధించడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జవహర్నగర్ పోలీసులు తెలిపిన వివరాలు.. జవహర్నగర్ చెన్నాపురానికి చెందిన నవీన్ (29) ప్రైవేటు ఉద్యోగి. అతడి సోదరి మమత మొదటి భర్తకు విడాకులివ్వడంతో తుర్కయంజాల్కు చెందిన బొమ్మరాజు కృష్ణతో రెండో వివాహం చేశారు. 5 తులాల బంగారం, అర కిలో వెండి, ఇతర కట్నకానుకలిచ్చి వివాహం జరిపించారు. అక్కా బావ, అత్తమామలు అదనపు కట్నం కావాలని నవీన్ను, అతని కుటుంబ సభ్యులను వేధించారు. ‘కట్నం ఇవ్వడం చేతకాని నువ్వు బతికి ప్రయోజనం ఏంటీ? నీవు చనిపోతే ఆస్తిలో వచ్చే వాటాను కట్నంగా తీసుకుంటాం’ అని తరచూ వేధించారు. ఈనెల 5న కృష్ణ, మమత ఖాళీ చెక్కులపై నవీన్తో సంతకాలుచేయించుకున్నారు. దీంతో నవీన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం తాను పనిచేస్తున్న గోదాంలో ఉరేసుకున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్