గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.
MLA


జోగులాంబ గద్వాల, 14 జూన్ (హి.స.)

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం ఎర్రవల్లి మండలం పుటాన్రెదొడ్డి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఆజీఎస్) నిధులతో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని సర్పంచ్ చిన్న నారాయణ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అనంతరం గ్రామస్థులు ఎమ్మెల్యే విజయుడిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande