రెండురోజుల అధికారిక పర్యటనకు సింగపూర్ వెళ్లనున్న చంద్రబాబు
రెండురోజుల అధికారిక పర్యటనకు సింగపూర్ వెళ్లనున్న చంద్రబాబు
రెండురోజుల అధికారిక పర్యటనకు సింగపూర్ వెళ్లనున్న చంద్రబాబు


అమరావతి, 14 జూన్ (హి.స.)

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల అధికారిక పర్యటనకు సింగపూర్ వెళుతున్నారు. ఆదివారం ఉదయం 11.35 గంటలకు ఆయన బెంగళూరు నుంచి బయల్దేరుతారు. 15, 16వ తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం ఉదయం 10.30కు సింగపూర్లో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు సమావేశమవుతారు. అదే రోజు స్టార్టప్ వెంచర్ కేపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. యూఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్బాచ్తో విందు సమావేశానికి హాజరవుతారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్తో, తర్వాత గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ భజ్వాతో, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్తో భేటీ అవుతారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యెంగ్ చెయ్తో, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణన్, హోం మంత్రి కె.షణ్ముగమ్, హెచ్ఆర్డీ మంత్రి టాన్సీ లెంగ్తో వరుస భేటీల్లో పాల్గొంటారు. సీఐఐ ఏపీ ప్రతినిధి బృందంతో సమావేవమవుతారు. మంగళవారం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించే సీబీఎన్ ఎట్దరేట్ ఆఫ్ 361 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. సుర్బానా జురాంగ్ - అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో సమావేశం అవుతారు.

---------------

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande