ప్రభుత్వ బడిలో చేరితే రిటర్న్ రూ.2 వేలు.. పెద్దపల్లి జిల్లాలో ఓ సర్పంచ్ బంపర్ ఆఫర్
ప్రభుత్వ బడిలో చేరితే రిటర్న్ రూ.2 వేలు.. పెద్దపల్లి జిల్లాలో ఓ సర్పంచ్ బంపర్ ఆఫర్
Peddapalli


పెద్దపల్లి, 14 జూన్ (హి.స.)

కనుమరుగవుతున్న ప్రభుత్వ

పాఠశాలలను కాపాడుకోవడానికి, విద్యార్థుల సంఖ్యను పెంచడానికి పెద్దపల్లి జిల్లాలో ఒక గ్రామ సర్పంచ్ తీసుకున్న వినూత్న నిర్ణయం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. తన ఊరిలోని ప్రభుత్వ బడి ఎట్టిపరిస్థితుల్లోనూ మూతపడకూడదనే పట్టుదలతో.. ఆ స్కూల్లో చేరే ప్రతి విద్యార్థికి రూ. 2,000 నగదు ప్రోత్సాహకాన్ని ఇస్తానంటూ ఓదెల మండలం శానగొండ గ్రామ సర్పంచి జీల రాజు బంపర్ ఆఫర్ ప్రకటించారు. శానగొండ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (Primary School) లో విద్యార్థుల సంఖ్య ఏటా దారుణంగా పడిపోతోంది. గత విద్యా సంవత్సరంలో ఈ బడిలో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే చదువుకున్నారు. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరంలో (2026-27) కొత్తగా ఒక్క విద్యార్థి కూడా చేరే పరిస్థితి కనిపించకపోవడంతో స్కూల్ పూర్తిగా మూతపడే ప్రమాదం ఏర్పడింది. దీనిని గమనించిన సర్పంచ్ జీల రాజు ఎలాగైనా బడిని బతికించుకోవాలని సంకల్పించారు. అందులో భాగంగానే విద్యార్థుల తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ఈ నగదు బహుమతిని ప్రకటించారు. ఈ నగదును రాబోయే దసరా పండుగ నాటికి విద్యార్థులకు అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande