
హైదరాబాద్, 14 జూన్ (హి.స.)
ఎగువన కురుస్తున్న వర్షాలతో నగరంలోని హిమాయత్ సాగర్(Himayat Sagar ), ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు వరద కొనసాగుతున్నది. హిమాత్ సాగర్లోకి 800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.జలాశయాల్లోకి వస్తున్న ఇన్ఫ్రా ఆధారంగా అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో జలాశయాల పరిసరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..