గత 12 సంవత్సరాల కాలంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది
గత 12 సంవత్సరాల కాలంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది
అనంతపురం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకండ్ల రాజేష్ తెలిపారు.


అనంతపూర్, 14 జూన్ (హి.స.): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సుపరిపాలన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న మోదీ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అనంతపురం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకండ్ల రాజేష్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, దేశాభివృద్ధిలో సాధించిన పురోగతిపై ఆయన వివరాలు ఈ రోజు ఉదయం ప్రేస్ మీట్ లో వెల్లడించారు.

గత 12 సంవత్సరాల కాలంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అనంతపురం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకండ్ల రాజేష్ పేర్కొన్నారు. పేదలు, అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు దాదాపు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని అన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్లాది ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు జాతీయ రహదారుల విస్తరణ వేగంగా జరిగిందన్నారు. రైతులకు ప్రతి సంవత్సరం రూ.6 వేల పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ పథకం, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించిన ఉజ్వల యోజన, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం వంటి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని తెలిపారు.

స్వచ్ఛ భారత్ మిషన్ కింద కోట్లాది మరుగుదొడ్లు నిర్మించగా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా దేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తోందన్నారు. కరోనా సమయంలో దేశీయంగా వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు అందించడం భారత సామర్థ్యానికి నిదర్శనమని కొనియాడారు.

అవినీతి రహిత పాలన, మహిళా సాధికారత, దేశ ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా, ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ సుపరిపాలన కార్యక్రమాలు ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకండ్ల రాజేష్ వెల్లడించారు.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande