
నెల్లూరు, 14 జూన్ (హి.స.)నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం నందు, రూ. 5 కోట్ల 60 లక్షల రూపాయలతో జరుగుతున్న పొట్టేపాలెం కలుజు పై బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడి ఆశీస్సులతో, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని, పొట్టేపాలెం కలుజు మీద శాశ్వతంగా బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు.
దశాబ్దాల కల పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి సమస్యను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పరిష్కారం చుపామని, నాణ్యత ప్రమాణాలతో శరవేగంగా పనులు సాగుతున్నాయని, ఆగస్టు నెలలో పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్, యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆశీస్సులతో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో, సుమారు 700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
శంకుస్థాపన చేసిన ప్రతీ అభివృద్ధి పనిని పర్యవేక్షించి, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందించడం జరిగిందని, స్థానికంగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా , డివిజన్ నాయకులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV