
కదిరి, 14 జూన్ (హి.స.)శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు లక్ష్యాలకు అనుగుణంగా FLN (పౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరాసి) 15000 వేలకు పైగా ప్రశ్నలతో తరగతి వారీగా ప్రత్యేకంగా రూపొందించిన చాంద్ బాషా అనే ఉపాద్యాయుడు పుస్తకావిష్కరణ గావించారు.
కదిరి పట్టణంలోని బాబా కాలనీకి చెందిన చాంద్ బాషా ఉపాధ్యాయులు రూపొందించిన అభ్యసన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం నేడు కదిరి పట్టణంలోని ఎం.ఆర్.సి ప్రాంగణంలో ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి చెన్నకృష్ణ Meo, ఓబుల్ రెడ్డి,యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాసులు ఆవిష్కరించడం జరిగినది.
ప్రధాన ఉపాధ్యాయులు మైనుద్దీన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పుస్తకాల వలన విద్యార్థులలో సృజనాత్మకత అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించుకోవడానికి ఎంతో గాను ఉపయోగపడతాయని, అదే విధంగా ప్రభుత్వ బడిని-విద్యార్థులను పటిష్ట పరచడానికి ఇది ఒక కరదీపికగా ఉపయోగపడుతుందని, ఈ పుస్తకం ద్వారా విద్యార్థుల యొక్క పూర్వ జ్ఞానాన్ని పరీక్షించి పదును పెట్టడానికి చక్కగా ఉందని, ఉపాధ్యాయులు దీనిని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లేటట్టుగా ఈ పుస్తక రచన ఉందని, 2025-DSC ద్వారా ఎంపికై కొత్తగా ఉద్యోగములో చేరి వేసవి సెలవులలో ప్రభుత్వ విద్యార్థుల గురించి చక్కగా ఆలోచించి ఈ పుస్తక రచన చేసినందుకు చాంద్ బాషా గారిని మరియు వారి తండ్రి బాబా ఫక్రుద్దీన్ ను అభినందించి ఆత్మీయ సన్మానం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV