తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి భారీగా సమయం
తిరుమల, 14 జూన్ (హి.స.) నేటితో విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగియనున్న క్రమంలో.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. శ్
తిరుమల


తిరుమల, 14 జూన్ (హి.స.)

నేటితో విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగియనున్న క్రమంలో.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి.. గో గర్భం డ్యామ్ వరకూ క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. నిన్న (శనివారం) స్వామివారిని 92,830 మంది భక్తులు దర్శించుకోగా.. 48,987 మంది భక్తులు తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.

నిన్న 4.64 లక్షల లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగినట్లు టీటీడీ పేర్కొంది. వెంగమాంబ అన్నదాన సత్రం సహా.. కొండపై 3.37 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande