ప్రపంచ రక్తదాతల దినోత్సవం: రక్తదాన శిబిరం నిర్వహణ
ప్రపంచ రక్తదాతల దినోత్సవం: రక్తదాన శిబిరం నిర్వహణ
ప్రపంచ రక్తదాతల దినోత్సవం: రక్తదాన శిబిరం నిర్వహణ


గుంతకల్, 14 జూన్ (హి.స.)

గుంతకల్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో ఈ రోజు 12-06-2026న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంతకల్ రెవిన్యూ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమం రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంతో పాటు మరింత మంది స్వచ్ఛంద రక్తదాతలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం-2026 థీమ్ అయిన “వన్ డ్రాప్ అఫ్ హ్యుమానిటీ . గివ్ బ్లడ్ . సేవ్ లివ్స్” సందేశాన్ని ప్రముఖంగా ప్రదర్శించారు.

ఈ శిబిరాన్ని గుంతకల్ రెవిన్యూ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎస్. హరి ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ ఎమ్మార్వో రమాదేవితో పాటు రెవిన్యూ, మున్సిపల్ సిబ్బంది రక్తదానం చేశారు. రక్తానికి కులం లేదు మతం లేదు అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమం విజయవంతం కావడంలో బ్లడ్ బ్యాంక్ అధికారులు, నర్సింగ్ సిబ్బంది, పర్యవేక్షకులు విశేష కృషి చేశారు. ప్రతి రక్తదానం ఒకటి కంటే ఎక్కువ ప్రాణాలను రక్షించే అవకాశం కల్పిస్తుందనే సందేశంతో కార్యక్రమం ముగిసింది. సమాజంలో మరింత మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande